Homeఆంధ్ర ప్రదేశ్రుషికొండ భవనాలను ఏం చేద్దాం...?

రుషికొండ భవనాలను ఏం చేద్దాం…?

  • తర్జనభర్జనలో కూటమి ప్రభుత్వం

  • ఈ నెలాఖరు నాటికి నిర్ణయం

  • లీజుకు ఇచ్చే అవకాశం 

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: రుషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అంతర్మధనంలో ఉంది. ఆ భవనాల వినియోగంపై ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతోంది. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించారు మంత్రి కందుల దుర్గేష్. త్వరలో రుషికొండ భవనాల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఒక నిర్ణయం ఖాయమని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నియంత పాలన, ప్రభుత్వ సొమ్ము దోపిడీ వంటి వాటితో నిర్మించిన భవనాల వినియోగ విషయంలో ఒకటికి రెండుసార్లు కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వాస్తవానికి గత రెండేళ్లుగా ఈ భవనాల విషయంలో తర్జనభర్జన సాగుతోంది. కానీ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతోంది. దీనిపై రకరకాల చర్చ నడుస్తోంది.

సాగరనగరంలో ల్యాండ్ మార్క్…

విశాఖలో రిషికొండ అనేది ఒక ల్యాండ్ మార్క్. పర్యాటకంగా చూడ చక్కని ప్రదేశం. అప్పట్లో ఋషికొండ భవనాలపై హరిత రిసార్ట్స్ ఉండేవి. వైసిపి ప్రభుత్వ హయాంలో వాటిని కూల్చేశారు. 9.8 ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్ల రూపాయలతో భారీ భవంతులను నిర్మించారు. కానీ ఏ అవసరం కోసం నిర్మించారు మాత్రం చెప్పలేదు. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో.. మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే జగన్ అక్కడ నుంచి పాలన సాగించేవారు అనేది బహిరంగ రహస్యం. అయితే ఈ భవనాల నిర్మాణం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆ పాపం వెంటాడింది.

నిబంధనలకు విరుద్ధం…

వాస్తవానికి రుషికొండపై భవనాల నిర్మాణ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ భూమి కోస్తా నియంత్రణ మండలి పరిధిలో ఉండడంతో.. నిర్మాణాలకు ఢిల్లీలోని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. వాస్తవానికి హరిత రిసార్ట్స్ నిర్మించిన సమయంలో 4.5 ఎకరాలకి అనుమతి లభించింది. ఆ రిసార్ట్స్ ను మాత్రమే కులగోట్టి అదే స్థలంలో పర్యాటకుల కోసం భవనాలు నిర్మిస్తున్నామని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కొండను భారీగా చెక్కేసి.. 9.8 ఎకరాల్లో నాలుగు బ్లాక్లో భవనాలను నిర్మించారు. కనీసం ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పలేదు. పైగా ఆ నిర్మాణాల చుట్టూ గ్రీన్ మ్యాట్ వేసి అటువైపు ఎవరిని రాణించేవారు కాదు. అప్పట్లో దీనిపై అనేక రకాల విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం మారిపోయి కూటమి ప్రభుత్వం రావడంతో అత్యధిక నిర్మాణ పనులు బయటపడ్డాయి.

క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు…

గతంలో సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రుషికొండ భవనాలను పరిశీలించారు. వెనువెంటనే ప్రత్యామ్నాయ వినియోగం కోసం వాడుకోవాలని భావించారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరిగాయి. ఆతిధ్యరంగంలో తాజ్, ఫెమా, వరుణ్ వంటి గ్రూపులు భవనాలను లీజుకు తీసుకునేందుకు ముందుకు వచ్చాయి. అయితే తాము సూచించిన కొన్ని మార్పులు చేస్తే తీసుకుంటామని మెలిక పెట్టాయి. దీంతో ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలుమార్లు భవనాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఒక విధంగా రుషికొండ ప్యాలెస్ ను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. చివరకు మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ఒకే సారి రెండు చోట్ల‌ఎన్నిక‌లు…! గెలిస్తే తెలంగాణ మ‌ళ్లీ హ‌స్తానిదే…?
  2. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌ల్లో క‌విత పార్టీ పోటి…!ఆ మూడు పార్టీల‌పై గ‌ట్టి ప్ర‌బావం…
  3. ఖాళీ అవుతున్న వైసీపీ…! పార్టీలో టెన్ష‌న్‌…
  4. కాలేశ్వరం పై రేవంత్ స‌ర్కార్‌ ఫోకస్…! న‌వంబ‌ర్ నుంచి మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు