Homeక్రైమ్టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి

టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి

ముంబయిలోని గోరేగావ్‌ తూర్పు రామమందిర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పబ్లిక్‌ టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను ప్రభాకర్‌ ధనివర్‌ (24), భావిక్‌ దేశాయ్‌ (18)గా పోలీసులు గుర్తించారు.

గణేశ్‌ నిమజ్జనం అనంతరం శుక్రవారం రాత్రి ఇద్దరూ రామమందిర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని పబ్లిక్‌ టాయిలెట్‌కు వెళ్లారు. వారు వెళ్లి అరగంట దాటినా బయటకు రాకపోవడంతో సహచరులు అనుమానంతో లోపలికి వెళ్లి చూశారు. అక్కడ తీవ్ర రసాయన దుర్వాసన మధ్య ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు.

వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. టాయిలెట్‌ పక్కనే ఉన్న ఓ పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు డ్రైనేజీలోకి చేరి విషవాయువు ఏర్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి, విషవాయువు ఏర్పడటానికి అసలు కారణాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.

also read: నాగర్‌కర్నూలులో దారుణం.. కొడుకులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు