HomeUncategorizedతెలంగాణాలో చంద్రబాబు...! పదేపదే ప్రస్తావిస్తున్న గులాబీ పార్టీ నేతలు...

తెలంగాణాలో చంద్రబాబు…! పదేపదే ప్రస్తావిస్తున్న గులాబీ పార్టీ నేతలు…

  • తమపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో లింక్

  • రేవంత్ గురుదక్షిణ గా ఏపీకి నీళ్లు వదిలేస్తున్నారంటూ ఆరోపణ..

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ లేదు. రాష్ట్ర విభజన తరువాత క్రమేపి టిడిపి తెలంగాణకు దూరమైంది. ఆ పార్టీకి కార్యకర్తల బలం ఉన్న.. ఎందుకో నాయకత్వం విషయంలో పట్టించుకోవడం లేదు చంద్రబాబు. ఇంతవరకు అక్కడ పార్టీ అధ్యక్షుడిని కూడా నియమించలేదు. దీని వెనుక రకరకాల చర్చ ఉంది. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కోసమే ఈ నిర్ణయం అన్న వారు ఉన్నారు. బిజెపి బలోపేతం కోసమే అని అభిప్రాయ పడినవారు ఉన్నారు. మరోవైపు గులాబీ పార్టీ కోసమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్నవారు ఉన్నారు. ఎందుకంటే టిడిపిని చూపించి, చంద్రబాబును చూపించి కెసిఆర్ అండ్ శిబిరం ఎంత రాజకీయం చేయాలో అంతలా చేసింది. అందుకే వ్యూహాత్మకంగా అక్కడ పోటీ నుంచి తప్పుకొని రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు అనేది ఖచ్చితమైన ఒక అభిప్రాయం.

భూముల అస్త్రంతో…

అయితే ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కెసిఆర్ భూములపై సమగ్ర విచారణ చేపడతామని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కెసిఆర్ ఫ్యామిలీ ఆస్తుల వివరాలను బయట పెట్టడంతో గులాబీ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఆ ఉచ్చు నుంచి బయటపడేందుకు సరికొత్త సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తోంది. కెసిఆర్, కేటీఆర్ ఫామ్ హౌస్ లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు గులాబీ పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును మళ్ళీ పదే పదే ప్రస్తావిస్తున్నారు.

అక్రమంగా నీళ్లు వదిలేస్తున్నారంటూ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా నీళ్లు వదిలేస్తున్నారని.. గురుదక్షిణ కింద తెలంగాణ హక్కులను తాకట్టు పెడుతున్నారని కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు ఒకే గలంలో తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల భూముల ఆక్రమణలపై రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ముగ్గురు నేతల పేర్లను ప్రస్తావిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ సంధించిన ప్రశ్నలకు నేరుగా, వాస్తవాలతో కూడిన సమాధానం చెప్పలేకనే.. గులాబీ పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఏపీ అంశాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే తమకు రాజకీయ ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి గులాబీ పార్టీ నేతలకు చంద్రబాబు ఒక అస్త్రంగా మారుతున్నారు. అయితే తెలంగాణ సమాజంలో చంద్రబాబుపై ఉన్న అభిప్రాయం మారుతోంది. ఒక రకమైన సానుకూల దృక్పథం ఏర్పడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు