Homeతెలంగాణఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు

– కల్వకుర్తి అదనపు కోర్టు, నూతన భవన నిర్మాణ నిధులపై చర్చ

క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కల్వకుర్తి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

కల్వకుర్తికి అదనపు కోర్టు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని న్యాయవాదులు అభినందించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కల్వకుర్తిలో నూతన కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఈ సందర్భంగా కోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) డిపో కార్యదర్శి రవీందర్, అధ్యక్షుడు శివ జగదీశ్వర్ తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 9న ఆర్టీసీలో నిర్వహించనున్న ఎన్నికలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆర్టీసీ సంఘం నాయకులకు తన పూర్తి మద్దతు, సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేష్, న్యాయవాదులు జమీల్, వెంకట్‌రెడ్డి, కృష్ణయ్య, భాస్కర్‌రెడ్డి, వెంకటరమణ, డిపో డ్రైవర్లు గిరిక రాములు, శ్రీనివాసులు, సదానందం, కండక్టర్లు భానుప్రకాష్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుట్టింటికి వెళ్తాన‌న‌డంతో భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌…! చివ‌రికి ఆ ఇంట తీవ్ర విషాదం ….

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు