-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కృష్ణుడు
-
మొన్నటి ఎన్నికలకు ముందు జగన్ పార్టీకి..
-
తాజాగా పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసుగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి సీనియర్ నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీను రాజీనామాతో ఆ పార్టీలో ఒక కుదుపు ఏర్పడింది. అది మరవకముందే గోదావరి జిల్లాలకు చెందిన కీలక నేత యనమల కృష్ణుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈయన మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోదరుడు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఎన్నికల్లో టిడిపి కూటమి గెలవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
ద్వితీయ శ్రేణి నాయకులు…
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చాలామంది నేతలు కృష్ణుడు వెంట జనసేనలో చేరడం విశేషం. తుని నియోజకవర్గ రాజకీయాల్లో దశాబ్దాలుగా యనమల కుటుంబానికి బలమైన పట్టు ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించారు యనమల కృష్ణుడు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో యనమల కృష్ణుడును కాదని.. ఆయన సోదరుడు యనమల రామకృష్ణుడు కుమార్ దివ్యకు హై కమాండ్ టికెట్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని విభేదిస్తూ కృష్ణుడు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేశారు. అయినా సరే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. తదనంతర పరిణామాలతో ఆయన వైసీపీలో ఇమడలేక ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
అనూహ్య నిర్ణయం…
ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి యనమల కృష్ణుడు పార్టీ మారుతారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. జనసేనలో చేరుతారని టాక్ నడిచింది. తాజాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. జనసేనలో చేరితేనే నియోజకవర్గంలో తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఈ నిర్ణయానికి వచ్చారు. జనసేన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపి.. చివరకు శుక్రవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. గోదావరి జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతంతమాత్రంగానే ఉంది. తాజాగా యనమల కృష్ణుడు పార్టీకి గుడ్ బై చెప్పడంతో చాలా పెద్ద నష్టం జరిగింది. కృష్ణుడు బాటలోనే మరి కొంతమంది వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడ చదవండి:
-
వివేకానందరెడ్డి హత్య కేసులో మలుపు…!
-
పార్టీ ఫిరాయింపుల్లో తెలంగాణకు మూడో స్థానం…!
-
హుజురాబాద్ ఉప ఎన్నిక…! బిఆర్ఎస్ కు అగ్నిపరీక్ష..
-
ఆర్టీసీలో ఎన్నికల సందడి…! 8 ఏళ్ల తరువాత గుర్తింపు ఎన్నికలు…
