Homeక్రైమ్కాకినాడ జిల్లాలో విషాదం.. మట్టిగోడ కూలి 8 ఏళ్ల బాలుడి మృతి

కాకినాడ జిల్లాలో విషాదం.. మట్టిగోడ కూలి 8 ఏళ్ల బాలుడి మృతి

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా మట్టిగోడ కూలిపోవడంతో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గాడిమొగ పంచాయతీ పరిధిలోని చిన్న వలసల గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది.

వర్షాల ప్రభావంతో ఒక్కసారిగా మట్టిగోడ కూలిపోవడంతో దాని కింద బాలుడు మల్లాడి లక్ష్మీనారాయణ చిక్కుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

బాలుడి మృతితో చిన్న వలసల గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా మట్టిగోడ కూలి చిన్నారి మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

also read: రెండు బైకులు ఢీ.. భార్యాభర్తలు మృతి.. మరో ఇద్దరికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు