కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలంలో గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో రామారెడ్డికి చెందిన బాలమణి (38), ఆమె భర్త రాజయ్య (45) మృతి చెందారు. రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో మరో ఇద్దరు యువకులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ఆన్‌లైన్ ఫుడ్ ప్లాట్‌ఫామ్‌లపై FSSAI కఠిన చర్యలు.. అసత్య క్లెయిమ్స్‌పై ఫోకస్
