Homeక్రైమ్మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి మృతి.. పరారీలో ఉన్న ప్రియుడు ఆత్మహత్యాయత్నం

మాదాపూర్ ఓయో హోటల్‌లో యువతి మృతి.. పరారీలో ఉన్న ప్రియుడు ఆత్మహత్యాయత్నం

మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న ఆమె ప్రియుడు రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈదుమెట్ల మర్రిపాలెంలోని తన ఇంట్లో బుధవారం ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తాగినట్లు పోలీసులు తెలిపారు.

విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు రవితేజను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. యువతి మృతి కేసులో రవితేజ కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

కాగా, ఈ నెల 21న మాదాపూర్‌లోని ఓయో హోటల్‌లో యువతి అర్ధరాత్రి సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో హోటల్ సిబ్బంది, సంబంధిత వ్యక్తులు ఆమెను కొత్తగూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

యువతి మృతి అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన అనంతరం రవితేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా అతడు ఆత్మహత్యాయత్నం చేయడంతో కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యువతి మృతి వెనుక అసలు కారణం ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

also read: బీహార్‌లో దారుణం.. పట్టపగలే నడిరోడ్డుపై యువతికి వేధింపులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు