మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేదా డేటా అసలు వాడని మొబైల్ యూజర్ల కోసం ప్రత్యేకంగా కేవలం వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ (SMS) సేవలు మాత్రమే ఉండే రీచార్జ్ ప్యాక్‌లను మార్కెట్లోకి తీసుకురావాలని అన్ని టెలికాం కంపెనీలను స్పష్టంగా ఆదేశించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖరీదైన ప్యాక్‌ల కారణంగా ఇంటర్నెట్ వినియోగించని సామాన్య ప్రజలపై అనవసరపు ఆర్థిక భారం పడుతోందన్న ఉద్దేశంతో ట్రాయ్ ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. దీని ప్రకారం, 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితితో పాటు, ప్రతినెలా సరిగ్గా ఒకే తేదీన సులభంగా రీచార్జ్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు కల్పించాలని సూచించింది. అంతేకాకుండా, 30 రోజుల కంటే ఎక్కువ వాలిడిటీ కోరుకునే వారి కోసం కూడా అటువంటి ప్లాన్లలో కనీసం ఒక్కటైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లకు స్పష్టం చేసింది.ఈ ప్యాక్‌లలో ఇంటర్నెట్ డేటా లేనందున ఇవి చాలా తక్కువ ధరకే వినియోగదారులకు లభించనున్నాయి. దీనివల్ల బేసిక్ ఫోన్లు వాడేవారికి మరియు కేవలం ఫోన్ కాల్స్ మాత్రమే మాట్లాడేవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
డ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దటమే కేంద్రం లక్ష్యం : అమిత్ షా
