క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్స్‌లో అభిమానులతో కలిసి తన తాజా చిత్రం ‘ప్యారడైజ్’ వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని హీరో నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తన అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడటం ద్వారా వారితో ఆనందాన్ని పంచుకోవాలని నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాని చేసిన ఈ అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణకు చెందిన యువ దర్శకుడు రూపొందించిన ఈ సినిమా పట్ల, అలాగే తన ప్రేక్షకుల పట్ల నాని ప్రదర్శించిన బాధ్యతను, నిబద్ధతను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
నిమ్స్ లో అవినీతి డాక్టర్…! ఆదాయానికి మించిన ఆస్తులు…
అయితే, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ప్రజల భద్రత అత్యంత ముఖ్యమని సీఎం నానికి గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు, సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. పోలీసులు పరిస్థితిని, భద్రతాపరమైన అంశాలను క్షుణ్ణంగా అంచనా వేసి, అభిమానుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి సేఫ్టీ గైడ్‌లైన్స్ ఖచ్చితంగా పాటించడం చాలా అవసరమని, దీనిపై పోలీసుల సూచనలు పాటించాలని రేవంత్ రెడ్డి వివరించారు.
ఆస్తాకుంజ్ పార్క్‌లో బాలికపై సామూహిక లైంగిక దాడి.. ముగ్గురు నిందితుల అరెస్ట్
