క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ (DSC)పై వైసీపీ శ్రేణులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ప్రతిపక్షం హోదాలో ఉంటూ వీధుల్లో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.సమాజానికి దిశానిర్దేశం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులపై దాడులు చేయడం, నిరసనల పేరుతో ఉద్రిక్తతలు పెంచడం అత్యంత దారుణమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అరాచకపూరిత ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని తేల్చి చెప్పారు. అల్లరి మూకలను, చట్టాన్ని ఉల్లంఘించే వారిని స్వేచ్ఛగా వదిలేస్తే భవిష్యత్తులో సామాన్య ప్రజల ప్రాణ ఆస్తులకు, ముఖ్యంగా మహిళల భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ ఘనవిజయం.. పార్లమెంట్లో మళ్లీ తిరుగులేని ఆధిపత్యం
వైసీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే వీధి పోరాటాలు మాని నేరుగా శాసనసభకు వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. “అసెంబ్లీ వేదికగా ప్రతి అంశంపైన ఆధారాలతో సహా చర్చించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజా నిజాలను ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే చట్టబద్ధంగా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు” అని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పిచ్చి పిచ్చి ఆటలు ఆడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, హద్దులు దాటితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు.
అమెరికా దాడి ముప్పు.. సాయుధ దళాలను తీవ్ర అప్రమత్తం చేస్తూ ఇరాన్ ‘కోడ్ 100’ నిర్ణయం
