Homeఆంధ్ర ప్రదేశ్ఉపాధ్యాయుల‌పై దాడిచేసిన వారిని వ‌దిలేదిలేదు...! మంత్రి నారా లోకేష్‌...

ఉపాధ్యాయుల‌పై దాడిచేసిన వారిని వ‌దిలేదిలేదు…! మంత్రి నారా లోకేష్‌…

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఉపాధ్యాయుల‌పై దాడి చేయ‌డం హేయ‌మైన చ‌ర్య అని మంత్రి లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విజ‌య‌వాడ‌లో స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల‌పై వైసీపీ నాయ‌కులు దాడిచేయ‌డం తీవ్ర‌త‌ప్పిద‌మ‌ని, అట్టివారిని వ‌దిలేద‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు. గురువుల‌పై దాడి చేసిన క్రిమిన‌ల్ గ్యాంగ్‌ల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని, వాళ్ల భ‌ర‌తం ప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. విద్యాబుద్దులు నేర్పించే గురువుల‌ను వైన్ షాపుల‌కు కాప‌లా పెట్టిన జ‌గ‌న్ ఉపాధ్యాయుల‌ను గౌర‌విస్తాడ‌ని అనుకోవ‌డం భ్ర‌మ అని అన్నారు. అత్యుత్తమ ఆటతీరుతో రాష్ట్రం, దేశ సత్తాను ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ దుర్బుద్ధి బయటపడిందని వ్యాఖ్యానించారు.

Also Read:వినాయక నిమజ్జనం వెనుక అసలు స్టోరీ ఇదే..!

క్రీడలతో దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగిందని మండిపడ్డారు. రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టిందని విమర్శించారు. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదన్నారు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలన్నారు. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి-బ్లేడ్ బ్యాచుల పనిపడతామంటూ ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.

Also Read: మద్యం కుంభకోణంలో జగన్…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు