క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మరియు జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెగా డిఎస్‌పిపై కొందరు కావాలనే లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని మండిపడ్డారు. రాష్ట్రంలో మోదీ, పవన్ కళ్యాణ్ మరియు తాను అధికారంలో ఉన్నంత కాలం ఎటువంటి అవినీతికి తావులేదని, భవిష్యత్తులోనూ ఎక్కడా అవినీతి జరగనివ్వమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ శ్రేణులకు గుడ్‌న్యూస్…! నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ ఆదేశం…
తాము అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అరాచక పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, అప్పట్లో ఏకంగా రూ. 10 లక్షల కోట్ల మేర భారీ అప్పులు మిగిలించారని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమాన్ని ఎక్కడా ఆపకుండా ప్రజలకు నిరంతరం అందిస్తున్నామని తెలిపారు. ఇదే జోరులో త్వరలోనే విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నేడు వైజాగ్ నగరంలో సుమారు 28,445 పేద కుటుంబాలకు రూ. 8,874 కోట్ల భారీ విలువైన ఇళ్ల పట్టాలను స్వయంగా అందజేసి, ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక-రణ్‌వీర్ దంపతులకు రెండో పాప జననం!
