క్రైమ్ మిర్రర్, సినిమా:- బాలీవుడ్ ప్రముఖ స్టార్ కపుల్ దీపిక పదుకొనె మరియు రణ్వీర్ సింగ్ దంపతులను మరోసారి మాతృత్వ, పితృత్వ ఆనందాలు వరించాయి.ఈ జంట ఇంట రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. తమకు పండంటి ఆడపిల్ల పుట్టిందనే సంతోషకరమైన వార్తను స్వయంగా దీపిక పదుకొనె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.ఈ అగ్ర హీరో హీరోయిన్లు గతంలో 2018 సంవత్సరంలో అంగరంగ వైభవంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వీరి దంపతులకు 2024 సెప్టెంబర్‌లో మొదటి సంతానంగా ‘దువా’ జన్మించింది. ఇప్పుడు తాజాగా వీరి కుటుంబంలోకి రెండో పాప కూడా రావడంతో దీపిక, రణ్వీర్ ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ శుభవార్త తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు, వివిధ రంగాల సెలబ్రిటీలు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ లవ్లీ కపుల్‌కు పెద్దఎత్తున అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నాని – శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ‘ప్యారెడైజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
కాంగ్రెస్ శ్రేణులకు గుడ్‌న్యూస్…! నామినేటెడ్ పదవుల భర్తీకి హైకమాండ్ ఆదేశం…
