-
భూఆరోపణలపై ఎదురు దాడిలో తగ్గిన పదును
-
సాంకేతిక అంశాలపై వివరణ కరువు
-
ప్రజల్లో పార్టీకి డ్యామేజ్
-
విపక్షంలో ఉండగా విలాసవంతమైన ఆస్తులపై చర్చ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ పై విసిరిన భూ అస్త్రం ప్రకంపనలే సృష్టిస్తోంది. అయితే వెంటనే గులాబీ పార్టీ అగ్ర నేతలు రంగంలోకి దిగారు. ఎదురుదాడి చేశారు. కానీ వారి వాదనల్లో పదును కంటే ఆత్మరక్షణ ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రాజకీయంగా సక్సెస్ అయ్యారు. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు.. ఏకంగా అసెంబ్లీ రికార్డుల్లో సర్వే నంబర్లు, విస్తీర్ణాల ఆధారంగా లెక్కలు బయట పెట్టడం వేరు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సరైన కౌంటర్ లేక…
Also Read:దారుణం.. ఐడెంటిటీ కార్డు ట్యాగ్‌తో భార్యను హత్య చేసి భర్త పరారీ
ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ అస్త్రాన్ని ఢీకొట్టే క్రమంలో సరైన కౌంటర్ ఇవ్వలేకపోయింది గులాబీ పార్టీ. ఇప్పుడు సరికొత్తగా తమది సంపన్నుల కుటుంబం అంటూ కేటీఆర్ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ భూములన్నీ నిజమే. మేం దాచి పెట్టిందేమీ లేదు. ఎన్నికల అఫీడవిట్లలో స్వయంగా పొందుపరిచినవే అని చెప్పడం.. తమ కుటుంబాలకు తరతరాలుగా వస్తున్న వేల ఎకరాల వారసత్వ భూములు ఉన్నాయని.. తమది జమీందారీ నేపథ్యమని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజల్లోకి మాత్రం వెళ్తున్న సంకేతాలు వేరు. పూర్తిస్థాయి అనుకూలంగా లేవు. అధికారం కోల్పోయిన తర్వాత నాయకుల విలాసవంతమైన ఆస్తుల గురించి చర్చ జరుగుతుండడం గులాబీ పార్టీకి డామేజ్ కలిగించే విషయం. అఫీడవిట్లలో ఉన్నంత మాత్రాన ప్రజల్లో ఏర్పడే సహజమైన భావోద్వేగం, అనుమానాలను పూర్తిగా కొట్టిపారేయలేరు.
పసలేని డిమాండ్లు…
Also Read: మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి
ఇప్పుడు గులాబీ పార్టీ రాజకీయ ఎదురుదాడి చేస్తోంది. గోడలకు సున్నాలు, రంగులు వేసుకునే రేవంత్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ రివర్స్ అటాక్ చేస్తోంది. సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తోంది. సాధారణంగా సిట్టింగ్ జడ్జి విచారణ డిమాండ్ అనేది సమస్యను పక్కదారి పట్టించే.. తప్పించుకునే పాతకాలపు ఎత్తుగడగా ప్రజలు భావిస్తారు. సాధారణ న్యాయస్థానాలు రాజకీయ పరస్పర ఆరోపణలపై సిటింగ్ జడ్జిలను విచారణ అధికారులుగా కేటాయించవన్న ప్రాథమిక నిబంధన అందరికీ తెలిసిందే. అందుకే ఇలాంటి డిమాండ్లు కేవలం కాలయాపనకే తప్ప.. రేవంత్ ప్రస్తావించిన సాంకేతిక అంశాలను సూటిగా సమాధానాలు కాలేవు.
సాంకేతిక ఆరోపణలపై…
Also Read:చిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్!
గులాబీ పార్టీ అగ్రనేతల భూములకు సంబంధించి చట్టబద్ధంగా కొన్నామని ఆ పార్టీ ఒప్పుకుంటుంది. అయితే ఆ భూములు ఎవరి హయాంలో.. ఏ ధరలకు.. ఎలాంటి నిబంధనల వెసులుబాటుతో కొన్నారు? అనే సాంకేతిక ఆరోపణలకు సంబంధించి తిప్పి కొట్టలేకపోతోంది గులాబీ పార్టీ. పారదర్శకమైన టైం లైన్ తో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా కొన్నారు? నిధుల మూలాలు ఏమిటి? అనే నిర్దిష్టమైన సందేహాలను నివృత్తి చేయకుండా.. కేవలం వ్యక్తిగత దూషణలు, గత చరిత్రను తిరగేయడం భారత రాష్ట్ర సమితి వాదనను ప్రజల్లో బలహీన పరుస్తోంది. భూముల వివాదంలో కేవలం వారసత్వ భూములు అని చెప్పడం.. మేం అఫీడవిట్లలో చూపించాం అనే రొటీన్ ప్రకటనలతో గులాబీ పార్టీ ఈ సంక్షోభాన్ని దాటడం అంత సులువు కాదు. ఒకవైపు లీగల్ గా చిక్కులు.. మరోవైపు ప్రజల్లో పొలిటికల్ డ్యామేజ్ ఎదుర్కోక తప్పదు.
