Homeతెలంగాణరేవంత్ రెడ్డి భూముల అస్త్రం!

రేవంత్ రెడ్డి భూముల అస్త్రం!

-డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న విపక్షం
-డ్యామేజ్ తప్పదు అంటున్న విశ్లేషకులు
-ఆందోళనలో బిఆర్ఎస్ శ్రేణులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో
:- రేవంత్ రెడ్డి భూముల అస్త్రం బిఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందా? ఫామ్ హౌస్ లెక్కలన్నీ బయటకు వస్తాయని భయపడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణ శాసనసభ వేదికగా నిషేధిత భూముల జాబితా, ధరణి పోర్టల్ నిర్వహణపై జరిగిన చర్చ రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని వారాలుగా 22a జాబితాలో ప్రైవేటు భూములు చిక్కుకున్నాయి అంటూ భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ చేసిన ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి చెందిన భూకమతాలు, ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లోని సర్వే నెంబర్ల వివరాల ను బహిర్గతం చేయడం ద్వారా ప్రతిపక్షాలు లేవనెత్తిన విమర్శనాత్మక శాస్త్రాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు.

పెద్ద అలజడి..
శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ దాడి అలజడి రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా రాజకీయ, చట్టపురమైన ప్రణాళికతో ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చాక భూ క్రమబద్దీకరణ విధానాలు, రికార్డుల సవరణల పేరుతో గత ప్రభుత్వ పెద్దలు లబ్ది పొందాలని ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో రాష్ట్రంలో కోటి ఎకరాలు 22a నిషేధిత జాబితాలో ఉందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను సీఎం ఖండించారు. అడవులు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ స్థలాలు కలిపి మొత్తం కోటి ఎకరాలు శాశ్వత నిషేధిత క్యాటగిరీలో ఉంటాయని.. పౌరుల మధ్య వివాదంలో ఉన్న ప్రైవేటు భూమి కేవలం మూడు లక్షల ఎకరాలు మాత్రమేనని సీఎం స్పష్టతనిచ్చారు.

పొలిటికల్ డ్యామేజ్ తప్పదా?
మరోవైపు సీఎం చేసిన ఆరోపణలతో పొలిటికల్ డ్యామేజ్ తప్పదని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమ పరిపాలన లోపాలను, 22 ఏ డిజిటలైజేషన్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపిస్తోంది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ పై వ్యూహాత్మక దాడి కాంగ్రెస్ పార్టీకి సామాజికంగా కలిసివచ్చే అంశం. అసైన్డ్ భూముల రక్షణ, దళిత హక్కుల అంశాన్ని ఎత్తుకోవడం ద్వారా బిఆర్ఎస్ కు డిఫెన్స్ వాతావరణాన్ని సృష్టించవచ్చని అధికారపక్షం ఆశిస్తోంది. అంతిమంగా చూస్తే 22 ఏ వివాదం కాస్త తెలంగాణలో వ్యక్తిగత ఆస్తులు, భూముల విచారణ రణ రంగానికి దారితీసింది. 30 రోజుల్లో సిద్దిపేట రెవెన్యూ అధికారులు ఇచ్చే విచారణ నివేదిక.. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో.. ఈ విచారణ ఎంతవరకు చట్టబద్ధంగా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు