Homeవైరల్బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ.. వైరల్ వీడియోతో పోలీసుల దర్యాప్తు

బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ.. వైరల్ వీడియోతో పోలీసుల దర్యాప్తు

నేపాల్‌లోని బజాంగ్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. పంకోట్ వంతెన వద్ద ఓ మహిళ బతికున్న కుక్కను సేతి నదిలోకి విసిరేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

స్థానిక సమాచారం ప్రకారం.. ఆ కుక్క ఎవరినో కరిచిందనే కారణంతో మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. నదిలోకి విసిరేసిన కుక్క ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, ఈ ఘటనకు పాల్పడిన మహిళ ఎవరు అనే విషయాన్ని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. మహిళను గుర్తించిన అనంతరం ఘటనపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

also read: ఆస్పత్రిలో కనీస సదుపాయాలు కరువు…! నేలపైనే వృద్ధుడి అవస్థలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు