Homeసినిమాఆనంద్ దేవరకొండ– వైష్ణవి చైతన్య పెళ్లి వార్తలపై క్లారిటీ.. అసలు విషయం ఇదే!

ఆనంద్ దేవరకొండ– వైష్ణవి చైతన్య పెళ్లి వార్తలపై క్లారిటీ.. అసలు విషయం ఇదే!

టాలీవుడ్‌లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జోడీకి మంచి క్రేజ్ ఉంది. ‘బేబి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట.. ఆ తర్వాత ‘ఎపిక్’లోనూ కలిసి నటించింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందంటూ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ఆనంద్, వైష్ణవి ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వైరల్‌గా మారాయి.

అయితే ఈ ప్రచారానికి వైష్ణవి చైతన్య తాజాగా స్పష్టత ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో డేటింగ్ రూమర్లపై స్పందించిన ఆమె.. ఆనంద్ దేవరకొండతో తనకు ఎలాంటి రొమాంటిక్ రిలేషన్‌షిప్ లేదని తెలిపింది. తామిద్దరం మంచి కో-స్టార్స్ మాత్రమే కాకుండా.. మంచి స్నేహితులమని స్పష్టం చేసింది. సినిమాల్లో తమ మధ్య కనిపించే కెమిస్ట్రీని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల్లో నిజం లేదనే విషయాన్ని ఆమె వెల్లడించింది.

మరోవైపు ఆనంద్ దేవరకొండ కూడా తన పెళ్లి గురించి గతంలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రాబోయే మూడేళ్లలో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే వైష్ణవి మాత్రం ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని పేర్కొంది. ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని స్పష్టం చేసింది.

దీంతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతానికి చెక్ పడినట్లైంది. ఇద్దరూ మంచి స్నేహితులమని చెప్పడంతో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేటింగ్ రూమర్లకు వైష్ణవి క్లారిటీ ఇచ్చినట్లయింది.

also read: ‘హనుమాన్‌ అంశ్‌’ తెలుగు రిలీజ్‌పై ఉత్కంఠ.. త్రివిక్రమ్‌ డీల్‌ నుంచి తప్పుకున్నారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు