క్రైమ్ మిర్రర్ : భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పర్వేజ్, 28 ఏళ్ల నగ్మాకు సుమారు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కుటుంబ ఆస్తుల పంపకం అనంతరం పర్వేజ్ తన పూర్వీకుల ఇంటిని విక్రయించాడు. దీంతో గత నెలన్నర రోజులుగా హర్దోయ్‌లోని ఇస్లాంనగర్ తిలియా ప్రాంతంలో భార్యతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
కొంతకాలంగా నగ్మా మరో వ్యక్తితో ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నట్లు పర్వేజ్ గుర్తించాడు. దీంతో ఆమెకు ఆ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 9 రాత్రి నగ్మా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పర్వేజ్ ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం పర్వేజ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల ఎదుట భార్యను తానే హత్య చేసినట్లు పర్వేజ్ అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న నగ్మా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పర్వేజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
also read :రమానందన, ఆమె భర్త మధుకర్‌పై మరో బాధితుడి ఆరోపణలు
