Homeతెలంగాణగులాబీకి 22ఏ భూముల ముళ్ళు...!

గులాబీకి 22ఏ భూముల ముళ్ళు…!

  • ధరణి పోర్టల్ తో పేదల భూములను కొట్టేసిన నాటి పెద్దలు

  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటన

  • బిఆర్ఎస్ మెడకు నిషేధిత భూముల వివాదం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గులాబీ పార్టీ ఎండగడుతూ వచ్చింది. ప్రధానంగా 22ఏ నిషేధిత భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటూ గులాబీ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీంతో ఆ పార్టీపై చేయి సాధించినట్టు కనిపించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ రివర్స్ పంచ్ గట్టిగానే ఇచ్చింది. గులాబీ పార్టీ ఇరకాటంలో పడాల్సి వస్తోంది. 22 నిషేధిత భూముల జాబితా, ధరణి పోర్టల్ అక్రమాలపై శాసనసభ వేదికగా వెల్లడించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అప్పటి గులాబీ పార్టీ పాలకుల కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న నిషేధిత భూముల వివరాలను వెల్లడించడం సంచలనంగా మారింది.

గత కొంతకాలంగా డిఫెన్స్ లో…

Also Read:దుస్తులపై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి ఘాటు స్పందన

గత కొంతకాలంగా 22a నిషేధిత భూముల విషయంలో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది. కానీ అదును చూసి శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టమైన వివరాలతో బయట పెట్టేసారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థను అడ్డం పెట్టుకొని దళితులు, పేదలకు కేటాయించిన భూములతో పాటు నిషేధిత 22 ఏ జాబితాలోని విలువైన భూములను గులాబీ పార్టీ అగ్రనేతలు, వారి బంధువులు క్రమబద్ధీకరించుకున్న తీరును వివరించారు. ప్రధానంగా హరీష్ రావు మామ పేరు మీద ఉన్న భూములు, పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థల భూములకు సంబంధించిన సర్వేనెంబర్ లతో సహా వివరాలను అసెంబ్లీలో బయటపెట్టారు మంత్రి పొంగులేటి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం పై ధరణి, 22 ఏ అంశాలపై విమర్శలతో దాడి చేసిన గులాబీ పార్టీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది.

వివరణ ఇచ్చినా...

Also Read:‘హనుమాన్ అంశ్’పై యువ సహ నిర్మాత క్లారిటీ.. నా పెట్టుబడి అంతే!

అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వివరాలు ప్రకటించిన తరువాత హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి లు స్పందించారు. మీడియా సమావేశాలు నిర్వహించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ భూములను పాము కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే… చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. కానీ నిషేధిత జాబితా కింద ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఏ ప్రాతిపదికన, ఏ అధికారంతో తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోగలరనేది ఇప్పుడు ప్రశ్న. సామాన్యుడు చిన్న ఫ్లాట్ కొనుగోలు చేసి 22ఏలో చిక్కుకుంటే దశాబ్దాల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరగాల్సి వస్తోంది. కానీ గులాబీ పార్టీ నేతల కుటుంబ సభ్యులు కొన్న భూములకు ఏ ఆటంకం లేకుండా ఎలా క్లియరెన్స్ వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. ధరణి పోర్టల్ తెచ్చింది కేవలం గులాబీ పార్టీ పెద్దల భూముల రెగ్యులైజేషన్ కోసం అని కాంగ్రెస్ ఆరోపించడం ప్రారంభించింది. పేదల ఆస్తులను బ్లాక్ లిస్టులో పెట్టి వేధించడానికి అలా చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది.

ఆత్మరక్షణలో గులాబీ పార్టీ…

Also Read:దుస్తులపై ట్రోలింగ్.. ఐశ్వర్య లక్ష్మి ఘాటు స్పందన

ఈ మొత్తం వ్యవహారంతో గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడింది.. ఎందుకంటే ఇప్పుడు వరకు 22a అంశం అనేది కాంగ్రెస్ పార్టీ శాపమని ఆరోపిస్తూ వస్తోంది. కానీ గత ప్రభుత్వంలోనే పేదల భూములు అక్రమ మార్గంలో గొల్లగొట్టారు అనే విషయాన్ని బయటపెట్టి చర్చకు దారి తీసేలా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రణరంగానికి తెర తీయనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు