అన్న మృతిని తట్టుకోలేక ఓ సోదరి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో చోటుచేసుకుంది. శనివారం అనారోగ్యంతో కొత్త మల్లయ్య యాదవ్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన సోదరి చుక వెంకమ్మ, అన్నను చివరిసారి చూసేందుకు అక్కడికి వచ్చారు.
అన్న భౌతికకాయాన్ని చూసిన వెంకమ్మ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దుఃఖంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
అన్న అంత్యక్రియలు పూర్తికాకముందే చెల్లెలి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో రాయగిరితో పాటు వెంకమ్మకు సంబంధించిన మరో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
also read: తల్లిని హత్య చేసిన కూతురు.. ప్రియుడితో కలిసి దారుణానికి ప్లాన్
