Homeక్రైమ్ఎద్దు దాడిలో మూడేళ్ల చిన్నారి.. కాపాడేందుకు వెళ్లిన తల్లిపైనా దాడి

ఎద్దు దాడిలో మూడేళ్ల చిన్నారి.. కాపాడేందుకు వెళ్లిన తల్లిపైనా దాడి

రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. అబు రోడ్‌ 24వ వార్డులోని శివాజీ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై ఒక్కసారిగా ఎద్దు దాడి చేసింది. చిన్నారిని కాపాడేందుకు తల్లి వెంటనే అక్కడికి వెళ్లగా.. ఎద్దు ఆమెను కూడా పక్కకు నెట్టేసింది.

అనంతరం చిన్నారిని కొమ్ములతో పైకి ఎత్తి గాల్లోకి ఎగరేసి కింద పడేసింది. దీంతో బాలికకు తీవ్ర భయంతో పాటు తలకు గాయాలయ్యాయి. తల్లి ధైర్యం చేసి ఎద్దును అక్కడి నుంచి తరిమేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో చిన్నారి తలకు గాయాలు కాగా.. తల్లికి స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే తల్లీబిడ్డను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా.. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. చిన్నారిపై ఎద్దు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

also read: ప్రకాశం జిల్లాలో విషాదం.. కొడుకు మరణం తర్వాత తల్లి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు