Homeఆంధ్ర ప్రదేశ్నాగబాబు కు క్యాబినెట్ హోదా...!

నాగబాబు కు క్యాబినెట్ హోదా…!

  • జీతంతో పాటు ఇతర అలవెన్సులు

  • ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: క్యాబినెట్ హోదాతో పదవి దక్కించుకున్నారు ఎమ్మెల్సీ నాగబాబు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా కొద్ది రోజుల కిందట బాధ్యతలు స్వీకరించారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నాగబాబు జీతభత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలను ఖరారు చేసింది. పర్యావరణ, అటవీ శాఖ ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక శాఖ సంబంధిత శాఖలకు సమాచారం అందించింది.

  • క్యాబినెట్ హోదా పొందిన వారికి..

వాస్తవానికి రాష్ట్రంలో క్యాబినెట్ హోదా పొందిన వారికి ప్రభుత్వం నెలకు రెండు లక్షల రూపాయల జీతం ఇస్తోంది. అలాగే ఆఫీస్ కు సంబంధించిన ఫర్నిచర్ ఏర్పాటు చేసేందుకు వన్ టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్సులు, ఇతర సౌకర్యాల కల్పనకు మరో రెండున్నర లక్షలు చెల్లిస్తోంది.

ఈ లెక్కన నాగబాబుకు జీతంతో పాటు అలవెన్సులు కలిపి మొత్తం నాలుగున్నర లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తాజా ఉత్తర్వుల్లో 2025 జనవరి 10న జారీ చేసిన జీవో నెంబర్ 7 ను ప్రస్తావించింది. అందుకే నాగబాబు జీతం పై ఒక స్పష్టత వచ్చింది.

  • చాలామందికి హోదా..

ఏపీలో నాగబాబు తో పాటు చాలామందికి క్యాబినెట్ హోదా ఉంది. మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ క్యాబినెట్ హోదాలో ఉన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారులైన చాగంటి కోటేశ్వరరావు, మంతెన సత్యనారాయణ రాజు, మాజీ కార్టూన్ నెట్ పోచంపల్లి శ్రీధర్ రావు లకు క్యాబినెట్ హోదా దక్కింది.

వీరందరికీ జీతభత్యాలు, అలవెన్స్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జీవోను జారీచేసింది. తాజాగా నాగబాబుకు కూడా క్యాబినెట్ హోదాలో ఇవే జీతభత్యాలు, అలవెన్సులు అందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా ఏపీ క్యాబినెట్ హోదాలో ఉన్న వారిలో చాగంటి కోటేశ్వరరావు, మంతెన సత్యనారాయణ రాజులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చే జీతం, అలవెన్సులు తిరస్కరించారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు