Homeక్రైమ్ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్

ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్

క్రైమ్ మిర్రర్ : ‘బాసింగ బలాలు’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఫిమేల్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో ఈశ్వర్ సాయి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

కేసును విచారించిన న్యాయస్థానం ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తరఫున న్యాయవాది నాగూర్ బాబు వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారురాలు ఇప్పటికే వివాహమైన వ్యక్తితో కొంతకాలంగా సంబంధంలో ఉన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

తన క్లయింట్‌పై ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయించారని ఈశ్వర్ సాయి తరఫు న్యాయవాది వాదించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఆరోపణలు చేస్తున్నారనే వాదనను కూడా కోర్టు ముందు ఉంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసులో ఆయనకు తాత్కాలికంగా న్యాయపరమైన ఊరట లభించినట్లయింది.
also read : తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు