క్రైమ్ మిర్రర్ : రెబ్బెన మండలం పుంజుమెరగుడ గ్రామంలో తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడై సిద్ధార్థ (20) ఇంటర్మీడియట్ వరకు చదివి ఆ తర్వాత చదువు మానేశాడు. అప్పుడప్పుడు వ్యవసాయ పనులకు వెళ్తూ ఇంటి వద్దే ఉండేవాడు.
ఈ నెల 9న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంచం కింద దాచిన రూ.3 వేల నగదును సిద్ధార్థ తీసుకున్నాడు. ఇంటికి వచ్చిన తండ్రి నాగేష్ డబ్బుల విషయం తెలుసుకుని కుమారుడిని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సిద్ధార్థ అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో గ్రామ సమీపంలోని పంట చేనుకు వెళ్లి గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు.
పురుగుల మందు తాగిన విషయాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన ఎస్‌ఐ వెంకట కృష్ణ తెలిపారు.
also read : విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి
