Homeక్రైమ్విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి

విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. విద్యార్థిని తల్లిదండ్రుల దాడి

క్రైమ్ మిర్రర్ : కల్యాణదుర్గంలోని నార్త్‌ హైస్కూల్‌లో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై దాడి చేసినట్లు సమాచారం. అనంతరం రామచంద్ర నాయక్‌ను వారు కల్యాణదుర్గం పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

నార్త్‌ హైస్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామచంద్ర నాయక్‌.. ఓ విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం విద్యార్థిని కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో వారు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం ఉపాధ్యాయుడిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. ఘటనపై సమగ్రంగా విచారణ చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించినట్లు తెలుస్తోంది.
also read : తండ్రిపై పిస్టల్ గురిపెట్టి కుమార్తె బెదిరింపులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు