Homeసినిమామేనల్లుడి పార్టీ మార్పు అంశం.. వేదికపైనే కంటతడి పెట్టిన బొత్స సత్యనారాయణ

మేనల్లుడి పార్టీ మార్పు అంశం.. వేదికపైనే కంటతడి పెట్టిన బొత్స సత్యనారాయణ

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- విజయనగరం జిల్లా గరివిడిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశం తీవ్ర భావోద్వేగాల నడుమ సాగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు.బొత్స మేనల్లుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం, రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మజ్జి శ్రీనివాసరావుతో తమకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, ఆయనతో కలిసి సాగించిన రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆందోళన చెందారు.

పాత టెక్నాలజీకి కొత్త రంగులా?’: యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌పై శాంసంగ్ వ్యంగ్యాస్త్రాలు

కార్యకర్తల మనోవేదనను, ఆందోళనను ప్రత్యక్షంగా చూసిన బొత్స సత్యనారాయణ చలించిపోయారు. వేదికపైనే ఆయన కన్నీళ్లు పెట్టుకోవడంతో సమావేశ ప్రాంగణంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే స్థానిక నాయకులు, అనుచరులు ఆయన వద్దకు వచ్చి ఓదార్చారు.రాజకీయంలో ఎలాంటి పరిణామాలు, మార్పులు ఎదురైనా తమ మద్దతు ఎల్లప్పుడూ బొత్స సత్యనారాయణకే ఉంటుందని కార్యకర్తలు, నాయకులు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా బొత్స వెంటే నడుస్తామని, ఆయన నాయకత్వంలోనే కలిసికట్టుగా ముందుకు సాగుతామని ధైర్యం చెప్పారు.

ప్రశాంత్ నీల్ సమర్పణలో హారర్ థ్రిల్లర్.. సెప్టెంబర్ 18న థియేటర్లలోకి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు