క్రైమ్ మిర్రర్ : జపాన్‌లో ఉద్యోగం చేస్తున్న కేరళకు చెందిన 22 ఏళ్ల యువతి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. బుల్లెట్ రైలు ఢీకొనడంతో వీ. దేవిక మృతి చెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవిక జపాన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఆమె మరణించడంతో స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జపాన్‌కు వెళ్లి కుమార్తెకు చివరి వీడ్కోలు పలికే పరిస్థితి వారికి లేకుండా పోయింది.
కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం కూడా కుటుంబానికి ఆర్థికంగా భారంగా మారింది. దీంతో జపాన్‌లోని కేరళ సంఘం ‘నిహన్ కైరేలీ’ దేవిక అంత్యక్రియల బాధ్యతను తీసుకున్నట్లు సమాచారం. దేవిక అంత్యక్రియలను హిందూ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. తల్లిదండ్రులు నేరుగా హాజరు కాలేని పరిస్థితుల్లో వారికి తమ కుమార్తెకు తుది వీడ్కోలు పలికే అవకాశం కల్పించేందుకు అంత్యక్రియలను లైవ్‌స్ట్రీమింగ్ ద్వారా చూపించనున్నారు. కూతురిని చివరిసారి చూసి వీడ్కోలు పలకాలని తల్లిదండ్రులు కోరుకున్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులు వారిని అడ్డుకోవడం కుటుంబానికి మరింత విషాదాన్ని మిగిల్చింది. జపాన్‌లోని కేరళ సంఘం ముందుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం కుటుంబానికి కొంత ఊరటనిచ్చింది.
also read : అబార్షన్ మాత్రలతో బాలిక మృతి..
