Homeక్రైమ్మోసం కేసులో యూట్యూబర్ నందన విచారణ.. భర్తకే అన్నీ తెలుసంటూ వివరణ

మోసం కేసులో యూట్యూబర్ నందన విచారణ.. భర్తకే అన్నీ తెలుసంటూ వివరణ

మోసం కేసులో యూట్యూబర్ నందనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.

విచారణ సందర్భంగా తన భర్త మధుకర్ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, కంపెనీకి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారని నందన చెప్పినట్లు తెలుస్తోంది. వీసాలు తీసుకున్న కొందరు సమయానికి విదేశాలకు వెళ్లకపోవడంతో అవి రద్దయ్యాయని ఆమె వివరించినట్లు సమాచారం.

అదేవిధంగా డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాల గురించి తన భర్త మధుకర్‌కే పూర్తి సమాచారం ఉంటుందని నందన చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

ఇక నందనను ఈ నెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

also read: తిరుపత్తూరులో వింత ఘటన.. ‘కరుప్ప స్వామి మా ఒంట్లో ఉన్నాడు’ అంటూ దంపతుల హల్‌చల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు