ఢిల్లీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రాకేశ్ మెహతా (74) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నోయిడాలోని తన నివాసంలో ఆయన ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఆయన రాసినట్లు భావిస్తున్న ఓ లేఖను గుర్తించారు.
ఆ లేఖలో తన నిర్ణయానికి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలే కారణమని రాకేశ్ మెహతా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఎదుర్కొన్న సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు.
రాకేశ్ మెహతా 1975 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. 2007 నుంచి 2010 వరకు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో ఆయన ఈ పదవిలో కొనసాగారు.
పదవీ విరమణ అనంతరం నోయిడాలో నివాసం ఉంటున్న రాకేశ్ మెహతా.. సోమవారం మృతి చెందారు. అనంతరం ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగిస్తున్నారు.
also read: ‘పరారీలో లేను.. బ్రిటన్ వీడే పరిస్థితి లేదు’.. విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు
