క్రైమ్ మిర్రర్, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని గౌతమ్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంగారు కమ్మల కోసం ఓ దుండగుడు 70 ఏళ్ల వృద్ధురాలిపై అమానుషంగా దాడి చేసి ఆమె చెవులను కోసి కమ్మలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గౌతమ్‌నగర్‌లోని బంగారు మైసమ్మ కాలనీ, రోడ్ నంబర్ 2లో నల్ల అరుంధతి (70) ఒంటరిగా ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంటి తలుపులు వేసుకుని నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి సమయంలో మంచం కింద నుంచి శబ్దం వినిపించడంతో పరిశీలించగా ఓ వ్యక్తి దాక్కుని ఉండటాన్ని గుర్తించింది.
Also Read: పోలీసుల దౌర్జన్యం వెనుక సీఎం రేవంత్: ‘దుశ్శాసన సభ’గా మారిందంటూ KTR ఫైర్
దుండగుడిని ప్రశ్నించడంతో అతడు వెంటనే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కత్తెరతో చెవులను కోసి, చెవులకు ఉన్న బంగారు కమ్మలను లాక్కున్నాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో మరోసారి దాడి చేసినట్లు సమాచారం. వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అప్రమత్తమయ్యారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడిన అరుంధతిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడిని నాటోరి నితిన్ (39)గా గుర్తించి గాలింపు చేపట్టి అతడిని అరెస్ట్ చేశారు.
Also Read:మంచి నిద్రకు మాటే మంత్రం.. ప్రశాంత నిద్ర కోసం ఆరోగ్య చిట్కాలు!
అరుంధతి సాధారణంగా హైదరాబాద్‌లో తన కుమారులతో కలిసి ఉంటుందని, వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎస్ఐ హరిబాబు తెలిపారు. సుమారు ఏడాది తర్వాత ఇంటిని శుభ్రం చేసేందుకు స్వగ్రామానికి వచ్చిన ఆమె, వారం రోజుల్లో తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై నిజామాబాద్ III టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు? దోపిడీకి ముందే వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read:బిగ్‌బాస్ రియాలిటీ షో: భారీ పారితోషికాలతో హోస్ట్‌ల హవా.. టాప్ ప్లేస్‌లో సల్మాన్ ఖాన్!
