క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రస్తుతం వస్తున్న కొన్ని సినిమాలు సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ప్రముఖ సినీ నటుడు సుమన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కొంతమంది ఫిల్మ్ మేకర్లకు సామాజిక బాధ్యత కొరవడిందని ఆయన విమర్శించారు.
సెన్సార్ బోర్డు తీరుపై ప్రశ్నలు:- సినిమాల్లో అసభ్యకరమైన, తీవ్ర హింసాత్మక దృశ్యాలు పెరిగిపోతున్నాయని సుమన్ పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్‌కు సెన్సార్ బోర్డు ఏ విధంగా అనుమతులు ఇస్తుందో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం వల్ల నేటి యువత పెడదోవ పడుతోందని, ఇలాంటి తరుణంలో సినిమాలు కూడా వారిని చెడు మార్గంలోకి మళ్లించకూడదని హితవు పలికారు.
సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలి:-సినిమాలు కేవలం వినోదం కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు కేవలం వ్యాపార కోణంలోనే ఆలోచించకుండా, సామాజిక బాధ్యతను గుర్తుంచుకొని మంచి చిత్రాలను తెరకెక్కించాలని సుమన్ పిలుపునిచ్చారు.
ఫ్యామిలీ అంతా ఒకే సబ్బు వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
మాజీ మంత్రి కొండా సురేఖకు వరుస షాక్‌లు: సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనం రద్దు!
