Homeక్రైమ్గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులకు గాయాలు

గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులకు గాయాలు

క్రైమ్ మిర్రర్ : సింగరేణి సంస్థకు చెందిన అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు భూగర్భ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. షిఫ్ట్‌ ముగిసే సమయంలో కార్మికులు భూగర్భంలో రూఫ్‌ బోల్టింగ్‌ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా ప్రమాదం సంభవించింది. అక్కడ విధుల్లో ఉన్న ఆపరేటర్‌ శ్రీనివాస్‌తో పాటు ఓ ఫిట్టర్‌ సహా మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన తోటి కార్మికులు, అధికారులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స కోసం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి దారితీసిన కారణాలు మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

భూగర్భ గనుల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించేలా గని నిర్వహణపై యాజమాన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు.
also read : మైనర్‌పై లైంగిక దాడి.. ఇద్దరు ఆటో డ్రైవర్ల అరెస్ట్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు