టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు.. గత రోజు ఉదయం నుంచి ఆయన నివాసం, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలు గురువారం వరకు కొనసాగినట్లు సమాచారం.
తనిఖీల సందర్భంగా లోకనాథం ఇంట్లో సుమారు రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇతర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అరెస్టు అనంతరం లోకనాథంను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సోదాల్లో గుర్తించిన ఆస్తులు, వాటి మూలాలు, అధికారిక ఆదాయంతో ఉన్న వ్యత్యాసాలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
also read: భార్య పుట్టినరోజు రోజే భర్త ఆత్మహత్య.. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగి బలవన్మరణం
