Homeక్రైమ్లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన టోలిచౌక్ ఎస్సై

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన టోలిచౌక్ ఎస్సై

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌ గోల్కొండ జోన్‌ పరిధిలోని టోలిచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై పాండు నాయక్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేలు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. ఓ మహిళ తన తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తనపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా చూడాలని, అలాగే పాస్‌పోర్టును సీజ్‌ చేయకుండా ఉండాలని ఎస్సై పాండు నాయక్‌ను కోరారు. ఇందుకు ప్రతిగా ఎస్సై లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనల మేరకు లంచం మొత్తాన్ని అందజేస్తుండగా ముందుగానే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు.

లంచం తీసుకున్నారనే ఆరోపణలపై పాండు నాయక్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.

also read ; నా అన్వేష్‌పై నెటిజన్ల ఆగ్రహం.. రష్యా యుద్ధ ప్రకటనతో తీవ్ర విమర్శలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు