Homeఆంధ్ర ప్రదేశ్ఈశ్వర్‌ సాయి కోసం పోలీసుల గాలింపు

ఈశ్వర్‌ సాయి కోసం పోలీసుల గాలింపు

క్రైమ్ మిర్రర్ : ఫోక్‌ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్‌ ఈశ్వర్‌ సాయిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో సన్నిహితంగా మెలిగి మోసం చేశాడంటూ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈశ్వర్‌ సాయిపై కేసు నమోదు చేశారు.

కేసు నమోదైనప్పటి నుంచి ఈశ్వర్‌ సాయి అందుబాటులో లేకపోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అతడిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం పోలీసులు వివిధ ప్రాంతాల్లో వెతుకుతున్నారు.

ఇటీవల ఈశ్వర్‌ సాయి, మాధురి రాథోడ్‌ ఒకే గదిలో ఉన్న సమయంలో ఈశ్వర్‌ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. అనంతరం శరణ్య మీడియాతో మాట్లాడుతూ తన భర్తపై తనకు నమ్మకం ఉందని, జరిగిన పరిణామాలకు మాధురినే కారణమని ఆరోపించింది.

మరోవైపు తనపై శరణ్య దాడి చేసి దుర్భాషలాడిందంటూ మాధురి రాథోడ్‌ వేములవాడ పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు కూడా చేసింది.

తాజాగా ఈశ్వర్‌ సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం రెండు ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈశ్వర్‌ సాయి అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read :మరోసారి బయటపడ్డ పాక్ వక్రబుద్ధి.. మోదీ ఉన్న ఫొటోను కట్ చేసి పోస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు