Homeక్రైమ్మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. మేనకోడలు అనుమానాస్పద మృతి

మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. మేనకోడలు అనుమానాస్పద మృతి

క్రైమ్ మిర్రర్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె సోదరుడి కుమార్తె బృష్టి ముఖర్జీ (28) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్ సమీపంలోని కుసుంబా గ్రామంలోని నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇంటి రెండో అంతస్తులోని తన గదిలో బృష్టి ముఖర్జీ ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతికి అసలు కారణం ఏమిటనేది పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.

కాగా, బృష్టి ముఖర్జీ కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె విడాకుల వ్యవహారం ప్రస్తుతం విచారణలో ఉందని, కొన్నేళ్లుగా మానసిక ఒత్తిడికి గురవుతూ చికిత్స కూడా తీసుకుంటున్నారని తెలిపారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పలువురి ఉద్యోగాలు రద్దయ్యాయి. ఆ ప్రభావం బృష్టి ముఖర్జీపై కూడా పడిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఆమె తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉపాధ్యాయ నియామకాల వ్యవహారంలో బృష్టి ముఖర్జీపై గతంలో ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం వంటి పరిణామాలు ఆమెపై ప్రభావం చూపి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె మృతికి ఖచ్చితమైన కారణం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. బృష్టి ముఖర్జీ తండ్రి నిహార్ ముఖర్జీ స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : జనసేన నేత హత్యకు కుట్ర కేసులో వైసీపీ నేత అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు