-
ఆత్మీయ సమావేశానికి అందని ఆహ్వానం
-
మారిన రాజకీయ పరిస్థితులే కారణం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జనసేన దూరం పెడుతుందా? అందుకే తాజాగా జరిగిన ఆత్మీయ సమావేశానికి ఆయనకు ఆహ్వానం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. పవన్ కళ్యాణ్ బాలినేని విషయంలో ప్రత్యేక ఆసక్తితో ఉండేవారు. అందుకే జనసేనలో చేరుతామంటే సాదరంగా ఆహ్వానించారు. కానీ పార్టీలో చేరాక కూటమిలో ఆయన ప్రవర్తిస్తున్న తీరుతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆయనను పక్కన పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు జనసేన ఆత్మీయ సమావేశానికి ఆయనకు ఆహ్వానం లేకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతోనే ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
వైసీపీని విభేదించి…
Also Read:‘హతః’లో ఏదో వింత ప్రపంచం.. నల్ల పిల్లితో ఆసక్తికరంగా ఫస్ట్ అప్డేట్!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు జనసేనలో క్రియాశీలక పాత్ర ఇస్తామన్న హామీ తోనే ఆయన పార్టీ మారినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎనలేని ప్రాధాన్యం దక్కింది. కానీ ఇటీవల టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనతో తీవ్రస్థాయిలో విభేదాలు ఏర్పడ్డాయి. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితుల్లో బాలినేని వైఖరితో కూటమికి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. అందుకే బాలినేని పవన్ పక్కన పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.
సుదీర్ఘ నేపథ్యం…
Also Read:కృష్ణపట్నం కాల్వలో గుర్తుతెలియని మృతదేహం.. ముత్తుకూరులో కలకలం
బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. యువజన కాంగ్రెస్ ద్వారా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1999లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ప్రాద్బలంతోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. 2009లో గెలిచిన బాలినేని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అందుకే ఆయన అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. మంత్రి పదవిని వదులుకొని మరి వైసీపీలో చేరారు. కానీ 2014 ఎన్నికల్లో బాలినేనికి ఒంగోలు నియోజక వర్గంలో ఓటమి ఎదురైంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చారు. 2019లో బాలినేని గెలిచేసరికి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే కొద్ది రోజులకే మంత్రివర్గ విస్తరణలో తొలగించేసరికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓడిపోయారు బాలినేని. పార్టీ సైతం ఓడిపోవడంతో బయటకు వచ్చేసారు. జనసేనలో చేరారు. అయితే ఇప్పుడు జనసేనలో ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అనేక రకాల అనుమానాలు…
Also Read:విషాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా ముగ్గురిని ఢీకొట్టిన రైలు
బాలినేని జనసేనలో చేరినప్పుడే రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయినా సరే పవన్ తనకు ప్రాధాన్యం ఇస్తారని బాలినేని భావించారు. అందుకు తగ్గట్టు పరిస్థితులు నడిచాయి. కానీ ఇప్పుడు జనసేన కీలక ఆత్మీయ సమావేశానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం లేకపోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. నాదెండ్ల మనోహర్ తో పాటు నాగబాబు నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో ఒక ఆత్మీయ సమావేశం జరిగింది. కానీ బాలినేనికి ఆహ్వానం లేదు. ఇటీవల టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తో ఆయనకు ఒక విమర్శల యుద్ధం నడిచింది. ఆ కారణంతోనే ఆయనకు ఆహ్వానం లేదని ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.
