- కరువు నేలకు తాకిన కృష్ణా జలాలు
- సొరంగాలను చీల్చుకుంటూ వెళ్లిన కృష్ణమ్మకు చంద్రబాబు సాష్టాంగ నమస్కారం
- వేడుకగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కరువు నేలపై కృష్ణమ్మ పరవళ్ళు తొక్కింది. సొరంగాలను చీల్చుకుంటూ రాయలసీమ సరిహద్దుకు చేరింది. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి ఉరకలేస్తూ చేరుకుంది. ఈ సుందర దృశ్యం ఈరోజు ఆవిష్కృతం అయింది. మూడు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. సుదీర్ఘ కాలపు నిరీక్షణ ఫలించి వెలిగొండ కళ నెరవేరింది. దీంతో ఆ ప్రాంతం పులకించిపోయింది. ప్రతి ఒక్కరి హృదయం భావోద్వేగంతో నిండిపోయింది.
మూడు దశాబ్దాల కిందట…
Also Read:సాయిరాం నగర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. ఐదు బైక్లు దగ్ధం
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆయన హయాంలోనే ఆ ప్రాజెక్టు నిర్మితమై.. జాతికి అందిస్తున్న వేళ సీఎం చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొండలను తులిచి నిర్మించిన సుదీర్ఘ సొరంగం నుంచి దూసుకొచ్చిన పవిత్ర కృష్ణా జలాలకు.. ఆయన భక్తిశ్రద్ధలతో చేతులెత్తి మొక్కారు. సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి.. పసుపు కుంకుమలు, పూలు సమర్పించి జల హారతి ఇచ్చారు. ప్రాజెక్టు వద్ద ఉద్భవించిన ఆ జల ధారణ చూస్తూ ఆయన కళ్ళు ఆనంద భాష్పాలతో చెమగిల్లడం.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కదిలించింది. ప్రజల జయ జయ ద్వానాల నడుమ ఉరకలెత్తిన ఉత్సాహంతో కృష్ణమ్మ ఆ నేలను తాకింది.
చంద్రబాబు కీలక ప్రసంగం…
Also Read: చంచల్గూడ జైలులో విషాదం.. రిమాండ్ ఖైదీ మృతి
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల కావడం తన జీవితంలో మరిచిపోలేని అత్యంత సంతృప్తికరమైన రోజుగా పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల రక్త కన్నీరు.. ఫ్లోరైడ్ రక్తసి బారినపడి వంకర బోయిన కాళ్లు, చేతులతో నరకం అనుభవించిన తల్లులు, బిడ్డల ఆక్రందనలకు ఇది శాశ్వత విముక్తి. ఈ ప్రాజెక్టు ద్వారా నీరు పారించడం నా జీవిత ఆశయం. ఈరోజు కృష్ణమ్మను ఈ గడ్డపై చూడడం ఒక పునర్జన్మ లాంటి అనుభూతి అంటూ ఆయన గద్గద స్వరంతో మాట్లాడారు.
అందరికీ అభినందనలు…
Also Read:రాళ్లతో కొట్టి రౌడీషీటర్ దారుణ హత్య.. జైలు నుంచి వచ్చి కొద్దిరోజులకే దారుణం
మరోవైపు ప్రాజెక్టు పరిధిలోని సొరంగా నిర్మాణ పనులు పూర్తి చేయడానికి కృషి చేసిన ఇంజనీర్లు, కార్మికుల సేవలను కొనియాడారు. సాంకేతికంగా అత్యంత క్లిష్టతరమైన నల్లమల అటవీ భూ గర్భంలో టన్నెల్ బోరింగ్ మెషిన్లతో ఎల్ల తరబడి పోరాడి.. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ కలను సాకారం చేసిన ఇంజనీరింగ్ బృందాన్ని, ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన నిర్వాసితులకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎంతటి సంక్షోభాలైనా వెనుకడుగు వేయకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించి ప్రజల పాదాల చెంతకు కృష్ణా జలాలు తెచ్చామని స్పష్టం చేశారు.
ఆనందంలో ప్రజలు…
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు దగ్ధం.. డ్రైవర్ సజీవ దహనం
మరోవైపు కృష్ణా జలాలు కరువు నేలకు తాకాయి అన్న వార్త తెలియగానే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని పల్లె నా సంబరాలు నిన్నంటాయి. కరువు నేలల్లో పండుగ వాతావరణం నెలకొంది. రైతాంగం, మహిళలు బాణాసంచ కాల్చి, స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. తరతరాలుగా తాగునీటికి, సాగునీటికి నోచుకోని వలసలు వెళ్లిన పల్లెలకు ఈ కృష్ణా జలాలు సరికొత్త ప్రాణవాయువును అందించాయి. వెలిగొండ సహకారంతో ఈ ప్రాంత భవిష్యత్తు బంగారు మయంగా మారనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
