తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6 నుంచి ఈ కొత్త సీజన్ సందడి మొదలు కానున్నట్లు సమాచారం. ఎప్పటిలాగే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండటంతో షోపై అంచనాలు భారీగా ఉన్నాయి.
100 రోజుల పాటు ఎంటర్‌టైన్‌మెంట్
సుమారు 100 రోజుల పాటు కొనసాగనున్న ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల మధ్య పోటీ, టాస్కులు, భావోద్వేగాలు, వివాదాలు, స్నేహాలు వంటి అంశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ప్రతి సీజన్‌లోనూ కొత్త ట్విస్టులతో ఆసక్తిని పెంచే నిర్వాహకులు.. ఈసారి కూడా ప్రత్యేకమైన కంటెంట్‌తో షోను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు ఛాన్స్
ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ‘అగ్నిపరీక్ష’ కార్యక్రమం ద్వారా ఎంపికైన నలుగురు సాధారణ వ్యక్తులు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇలా సెలబ్రిటీలు, సామాన్యుల కలయికతో హౌస్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన కంటెస్టెంట్లు ఒకే ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.
ఈసారి అంచనాలు భారీగానే..
బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే టెలివిజన్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రతి సీజన్‌కు కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు, ఎలిమినేషన్లు, హౌస్‌లో జరిగే పరిణామాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటాయి. ఈ నేపథ్యంలో సీజన్ 10ను గత సీజన్ల కంటే మరింత గ్రాండ్‌గా తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లు ఎవరు? సామాన్యులుగా ఎంపికైన ఆ నలుగురు ఎలాంటి ఆట ఆడతారు? నాగార్జున హోస్టింగ్‌లో సీజన్ 10 ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది? తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు వేచి చూడాల్సిందే.
also read: ఇమ్రాన్ హష్మీకి స్వైన్‌ఫ్లూ.. వాయిదా పడిన బాలీవుడ్ థీమ్ ఈవెంట్
