తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గరయ్యేందుకు నటి తాప్సీ పన్ను సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగిన తాప్సీ.. ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాలో నటించనున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
వైవిధ్యమైన కథలు, డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. హారర్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో తెరకెక్కే ఈ సినిమాలో తాప్సీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కథ, తాప్సీ పాత్ర ఎలా ఉండబోతున్నాయి? ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది? అనే విషయాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. గతంలో తాప్సీ టాలీవుడ్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై అప్పట్లో సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. ఇప్పుడు అదే తాప్సీ తెలుగు సినిమాతో తిరిగి వస్తున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.
మరి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తాప్సీ నటించే సినిమా నిజంగానే పట్టాలెక్కుతుందా? ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
also read: గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల బాలుడి మృతి.. కంపెనీ భద్రతపై ప్రశ్నలు
