స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫొటోలు ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హతో పాటు పెంపుడు శునకాలతో కలిసి గడిపిన అందమైన క్షణాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
పచ్చని వాతావరణంలో పిల్లలతో కలిసి స్నేహారెడ్డి దిగిన ఫొటోలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలోని పెంపుడు శునకాలు కూడా ఈ ఫొటోల్లో సందడి చేశాయి. పిల్లలతో గడిపే సమయమే తనకు ఎంతో ప్రత్యేకమని చెబుతూ.. వారి చిన్న చిన్న అడుగులు ఇంటిని మరింత ఆనందంతో నింపుతాయనే భావనను స్నేహారెడ్డి వ్యక్తం చేశారు.
స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు మాత్రం మరో విషయాన్ని గమనించారు. చిత్రాల్లో అల్లు అర్జున్ కనిపించకపోవడంతో ‘ఏఏ ఎక్కడ?’, ‘అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నారు?’, ‘క్యూట్ ఫ్యామిలీ.. కానీ బన్నీ మిస్సయ్యారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. తమ కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక క్షణాలను ఈ జంట అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ ఏడాది మార్చిలో తమ వివాహ బంధానికి 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా కూడా ప్రత్యేకంగా వేడుకలు చేసుకున్నారు. ప్రేమ, కుటుంబం, పిల్లలు, ఎన్నో మధుర జ్ఞాపకాలతో తమ ప్రయాణం అందంగా కొనసాగుతోందని ఆ సమయంలో స్నేహారెడ్డి పేర్కొన్నారు.
మొత్తానికి స్నేహారెడ్డి తాజా ఫ్యామిలీ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటుండగా.. అందులో అల్లు అర్జున్ లేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
also read: ‘కొమరక్క’ గానే కాదు.. ఇకపై ‘నాగులు’గా గుర్తింపు.. కొమరం భావోద్వేగ వ్యాఖ్యలు
