Homeక్రైమ్దారుణం...హిందూ కుటుంబం దారుణ హ‌త్యా...!

దారుణం…హిందూ కుటుంబం దారుణ హ‌త్యా…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: బంగ్లాదేశ్‌లో హ‌త్య‌కుగైర‌న కుటుంబం దార‌ణ హ‌త్య ఘ‌ట‌న‌లో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. నిందితులు కుటుంబంలో న‌లుగురిని హ‌త్య చేసి అక్క‌డి నుంచి పారిపోకుండా అక్క‌డే కొన్ని గంట‌ల పాటు ఉండి స్నానం చేసి, ప్రిజ్‌లో ఉన్న దోస‌కాయ‌లు, ఖ‌ర్జూరాలు తిన్నారు. అనంత‌రం మాద‌క‌ద్ర‌వ్యాలు సేవించారు. ఈ కేసులో ఇద్ద‌రు నిందితుల‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య‌కు గురైన వారిలో రంగ్‌పూర్ జిల్లా పాఠశాల మాజీ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె ఆగామి (23), కుమారుడు ప్రియమ్ (12)గా గుర్తించారు. రంగ్‌పూర్ నగరంలోని దాస్‌పారా ప్రాంతంలోని వారి ఇంట్లో శనివారం రాత్రి సుమారు 11.30 గంటలకు మృతదేహాలను గుర్తించారు. సిద్ధార్థ దాస్, ముగ్ధ దాస్ అనే ఇద్దరు వ్యక్తులు పక్క భవనం మీదుగా గణపతి ఇంటి పైకప్పు పైకి వెళ్లారు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. పైకప్పుపై శబ్దాలు విని గణపతి అక్కడికి వెళ్లి వారిని ప్రశ్నించడంతో గొడవ జరిగింది.

Also Read:పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై UIDAI కీలక ప్రకటన.. సెప్టెంబర్ 30లోపు ఈ పని పూర్తి చేయండి!

తమను గుర్తిస్తారనే భయంతో నిందితులు గణపతి గొంతును తువ్వాలతో బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గణపతి అరుపులు విని ఆయన భార్య ప్రీతిలత పైకి వెళ్లగా, ఆమెను కూడా మెట్ల వద్ద గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుమార్తె ఆగామి, 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్‌ను కూడా హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. గణపతి మృతదేహం పైకప్పుపై, ప్రీతిలత, ఆగామి మృతదేహాలు మెట్ల వద్ద, ప్రియమ్ మృతదేహం ఇంట్లోని మంచం కింద లభించాయి. కుటుంబాన్ని హత్య చేసిన తర్వాత నిందితులు వెంటనే పారిపోకుండా అదే ఇంట్లో కొన్ని గంటలు గడిపినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోనే స్నానం చేసి, ఫ్రిజ్‌లో ఉన్నవాటిని తిన్నారు. అనంతరం తమ వద్ద ఉన్న డ్రగ్స్ సేవించారని దర్యాప్తులో తేలింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో రోడ్లపై రద్దీ తక్కువగా ఉన్న సమయంలో వారు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. హత్యలను దోపిడీ ఘటనగా చూపించేందుకు నిందితులు ప్రయత్నించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:ప్రాంక్ మెసేజ్‌తో బయటపడిన బెట్టింగ్ బాగోతం.. ఫ్లాట్‌లో రూ.30 లక్షలు బట్టబయలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు