Homeతెలంగాణఅందరి టార్గెట్ హరీష్...!

అందరి టార్గెట్ హరీష్…!

  • ఎంఐఎం నేత కుటుంబ వివాహ వేడుకలకు లండన్ కు

  • అదే వేడుకలకు సీఎం రేవంత్

  • ఇద్దరి మధ్య సయోధ్య అంటూ ప్రచారం

  • రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంతవారు సైతం

  • తెలంగాణ రాజకీయాల్లో విచిత్రం

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నడుస్తున్నాయి. అయితే ఎవరికీ ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో తెలియని పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో బహు పార్టీలు ఉన్నాయి. అయితే అందరి దృష్టి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పై ఉంటుంది. ఆ పార్టీ వరుస అపజయాలు ఎదుర్కొంటోంది. కానీ తెలంగాణ సమాజంలో ఆ పార్టీ ప్రభావం ఎక్కువ. అలాగని అధికారంలోకి వస్తుందని చెప్పలేం.. రాదని అంతకంటే చెప్పలేం. అయితే ఆ పార్టీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతుంటాయి. ప్రధానంగా ఆ పార్టీ కీలక నేత హరీష్ రావు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలో వ్యతిరేకులకు ఆయన కేంద్ర బిందువుగా మారుతుంటారు. తాజాగా ఓ అంశంలో హరీష్ రావు టార్గెట్ అయ్యారు.

ఓవైసీ కుటుంబ వేడుకలు…

Also Read: ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్థినిపై బ్లేడ్‌తో దాడి

లండన్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ వివాహ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు గులాబీ పార్టీ కీలక నేత హరీష్ రావు తో పాటు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఇప్పుడు హరీష్ రావు చుట్టూ వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అది వేరువేరు సందర్భాల్లో జరిగిన విదేశీ పర్యటన. ఆపై శుభకార్యం హాజరు. కానీ తెర వెనుక ఏదో రహస్య రాజకీయ ఒప్పందం జరిగిందని.. గూడుపుఠాణి జరిగింది అంటూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హరీష్ రావు చుట్టూ ఒక రాజకీయం మొదలైంది.

తెలంగాణ పాలిటిక్స్ లో కీలకం…

Also Read:ప్రమాదం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోలేదు: సంజూష్

ఎంత చెప్పుకున్నా తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు అనే నేత కీలకం. ఆయన గులాబీ పార్టీకి చెందిన కీలక నేత. తనకంటూ ఒక రాజకీయ శైలి, క్షేత్రస్థాయిలో బలం ఉన్న నాయకుడు కూడా. అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎదురు దాడి చేయాలన్నా.. పాలనాపరమైన గణాంకాలతో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా.. క్షేత్రస్థాయి సమస్యలపై పార్టీ శ్రేణులను కదిలించాలన్నా హరీష్ రావు ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన టార్గెట్ చేసుకునే తీరు ప్రత్యేకం. ఆపై సొంత పార్టీలో అంతర్గత రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్య సమీకరణల మధ్య తనకంటూ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఆయన సొంతం. గులాబీ పార్టీ క్యాడర్ లోను ఆయనకు ప్రత్యేక ఇమేజ్ ఉంది.

సొంతవారికి సైతం…

Also Read: మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కల హడావిడి….!

హరీష్ రావు ప్రత్యేక శైలి రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడదు. ఒక్కోసారి సొంత పార్టీ శ్రేణులకు సైతం ఎంత మాత్రం నచ్చదు. కేటీఆర్ తో పాటు కవిత వంటి అగ్రసేని నాయకత్వ సమీకరణలు ఒకవైపు.. తనకంటూ సొంత ఇమేజ్ తో పాటు పట్టున్న హరీష్ రావు ఒకవైపు అన్నట్టు ఉంటుంది గులాబీ పార్టీలో పరిస్థితి. అటు రేవంత్ రెడ్డితో వ్యక్తిగత రాజకీయ శత్రుత్వం ఓ రేంజ్ లో ఉంటుంది.. దానిపై గులాబీ పార్టీలో ఒక వర్గానికి అనుమానం కూడా ఉంది. రేవంత్ తో హరీష్ సయోధ్య అంటూ గత కొంతకాలంగా గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే అది హరీష్ రావు కు ఉన్న ఇమేజ్ను తెలియజేస్తుంది తప్ప మరొకటి కాదు. రేవంత్ తో ఎంత శత్రుత్వం పెంచుకుంటే గులాబీ పార్టీలో అంతా అనుమానం అన్నట్టు హరీష్ రావు విషయంలో ఉంది. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ వివాహ వేడుకల్లో ఇది స్పష్టంగా కనిపించింది కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు