క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక్కసారిగా దగ్గరైన మమిత బైజు ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారారు. రీను పాత్రలో ఆమె చూపించిన సహజమైన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి స్పందన రావడంతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ముఖ్యంగా తమిళంలోనూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోవడంతో మమిత కెరీర్ వేగంగా ముందుకు సాగుతోంది. ప్రేమలు తర్వాత మమితకు వచ్చిన గుర్తింపు ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమాలో ఎలాంటి హంగులు లేకుండా సహజంగా కనిపించిన ఆమె.. యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ప్రదీప్ రంగనాథన్‌తో డ్యూడ్, విజయ్ నటించిన జన నాయకన్, ధనుష్‌తో కారా వంటి ప్రాజెక్టులతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.ఇటీవల సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలోనూ మమిత కనిపించారు. సూర్య లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం రావడంతో ఆమెకు మరో క్రేజ్ వచ్చింది. దీంతో మమితను కేవలం మలయాళ హీరోయిన్‌గా కాకుండా తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయమైన నటిగా చూడటం మొదలైంది.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో గ్యాంగ్‌స్టర్ హత్య.. పోలీసుల అదుపులో ముగ్గురు
ఇక ఇప్పుడు మమిత కెరీర్‌లో మరో కీలకమైన మలుపు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు భారీ మార్కెట్ ఉండటంతో స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాలు హీరోయిన్ల కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేస్తున్నాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో నటించే అవకాశం వస్తే మమితకు కూడా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.అయితే మమిత ఇప్పటివరకు ఎంచుకున్న పాత్రలను పరిశీలిస్తే ఎక్కువగా సహజత్వానికి దగ్గరగా ఉండే క్యారెక్టర్లే కనిపించాయి. ప్రేమలు సినిమాలోని రీను పాత్ర ఇందుకు మంచి ఉదాహరణ. భారీ యాక్షన్ మూవీ లేదా స్టార్ హీరో సరసన పూర్తిస్థాయి కమర్షియల్ హీరోయిన్‌గా ఆమెను ఇంకా ప్రేక్షకులు చూడలేదు. అలాంటి పాత్రలో మమిత ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.మరోవైపు మమితకు ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు రావడం ఆమెకు కలిసొచ్చే అంశంగా మారింది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఫ్రెష్ లుక్, సహజమైన నటన ఆమెకు అదనపు బలంగా ఉన్నాయి. అందుకే పాన్ ఇండియా మేకర్స్ కూడా ఆమె వైపు చూస్తున్నారనే చర్చ వినిపిస్తోంది.ప్రస్తుతం మమిత ముందు ఉన్న అసలు ప్రశ్న ఒక్కటే. మరో యూత్‌ఫుల్ లవ్ స్టోరీని ఎంచుకుంటారా? లేక ఏకంగా ఓ పాన్ ఇండియా స్టార్ హీరో సరసన భారీ ప్రాజెక్ట్‌తో కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తారా? రాబోయే రోజుల్లో ఆమె ఎంచుకునే సినిమా కెరీర్‌లో తదుపరి స్థాయిని నిర్ణయించే అవకాశం ఉంది.
