-
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రకటించిన సీఎం రేవంత్
-
తీవ్రంగా తప్పు పట్టిన కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్
-
ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి ఎవరు అంటూ హాట్ కామెంట్స్
-
తానే బరిలో ఉంటానని ప్రకటన
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మరో కొత్త చిచ్చు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇటీవల పరకాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఈ సీట్ పై అప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్. సీఎం ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు.. అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఎదుగుదల వెనుక…
Also Read:రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట.. లైంగిక వేధింపుల కేసు కొట్టివేత
తన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సుస్మిత పటేల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి రాజకీయ ఎదుగుదల లో కొండా కుటుంబం పాత్ర ఉందన్నారు. నాడు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి తమ తల్లిదండ్రులైన కొండా సురేఖ, కొండ మురళి పూర్తి మద్దతు ప్రధాన కారణం అని పేర్కొన్నారు. పిసిసి చీఫ్ అయిన కొత్తలో స్వయంగా తమ ఇంటికి వచ్చి కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాట ఇచ్చారని.. ఇప్పుడు ఆ హామీని ఎందుకు విస్మరిస్తున్నారు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని నిలదీశారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసిన సీనియర్ నేతలను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగని ఆమె రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల అభ్యర్థిగా ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ తీవ్ర పదజాలంతో ప్రశ్నించారు. పరకాల నియోజకవర్గం గురించి రేవురికి అసలు ఏం తెలుసు అని నిలదీశారు.
పాలనపై విమర్శలు…
Also Read:నాగపంచమి వేళ వింత ఆచారం.. గడ్డి తింటున్న 70 ఏళ్ల వృద్ధుడు.. చూసేందుకు పోటెత్తిన జనం
కొండా సురేఖ కుమార్తె మరోవైపు కాంగ్రెస్ పాలనపై కూడా విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు సంతోషంగా లేరని.. బీసీ వర్గాల నేతలకు సీఎం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి సీఎం గా కొనసాగుతారు కూడా తెలియదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య రేసు నడుస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. పరకాల రాజకీయాల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని.. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తానే బరిలో ఉంటానని.. తనను ఆపే శక్తి ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అయితే ఇటీవల కొండా సురేఖ స్వరంలో కూడా మార్పు వస్తోంది. ఇప్పుడు ఆమె కుమార్తె సైతం సీఎం రేవంత్ లెక్కలేని విధంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది
