క్రైమ్ మిర్రర్ : ఆత్మకూరులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్‌కు చెందిన భార్యాభర్తలు ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. అనారోగ్యంతో భార్య లక్ష్మీదేవి మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో భర్త సుబ్బరాయుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది.
భార్య మృతితో తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బరాయుడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. జీవితాంతం ఒకరికొకరు అండగా నిలిచిన దంపతులు ఒకే రోజు కన్నుమూయడంతో స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. భార్య అంత్యక్రియలు పూర్తికాకముందే భర్త కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో శ్రీరామ్ నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read : వర్షాకాలంలో జలుబు, దగ్గుకు మిరియాలు ఇలా వాడండి…!
