Homeతెలంగాణహరీశ్ రావుకు హౌస్ అరెస్ట్.. కోకాపేట్‌లో భారీగా పోలీసుల మోహరింపు

హరీశ్ రావుకు హౌస్ అరెస్ట్.. కోకాపేట్‌లో భారీగా పోలీసుల మోహరింపు

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు భారీగా మోహరించారు. హరీశ్ రావు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రిని సందర్శించేందుకు హరీశ్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయన పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం.

హరీశ్ రావు నివాసం చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో కోకాపేట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

హరీశ్ రావు హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. టిమ్స్ ఆస్పత్రి పర్యటన నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

also read: మెగాస్టార్ కెరీర్‌లో తొలిసారి.. హారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు