-
కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయం
-
వనపర్తి నియోజకవర్గం లో మారుతున్న రాజకీయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: సీనియర్ నేత జీవన్ రెడ్డి బాటలో మరో సీనియర్ చిన్నారెడ్డి వెళ్ళనున్నారా? అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారా? గులాబీ పార్టీలో చేరుతారా? హస్తం పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంటారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
బయటపడిన విభేదాలు…
Also Read:35 ఏళ్లకే టాలీవుడ్ హీరోయిన్ మృతి… ! నెల రోజుల తర్వాత బయటపడ్డ విషాద వార్త…
ఇటీవల వనపర్తి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి ని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి పార్టీ టికెట్ కొనుక్కున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడడానికి ఎమ్మెల్యే వైఖరి కారణమని వ్యాఖ్యానించారు. అయితే ఒక్కసారిగా నియోజకవర్గ కాంగ్రెస్లో విభేదాలు బయటపడటం.. పార్టీ శ్రేణులు అడ్డగోలుగా చీలిపోయి ఆరోపణలు చేసుకోవడం సంచలనంగా మారింది.
చివరి క్షణంలో మరొకరికి టికెట్…
Also Read:ఓటీటీలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్… ఎక్కడ చూడొచ్చంటే…?
మొన్నటి ఎన్నికల్లో సీనియర్ నేతగా ఉన్న చిన్నారెడ్డిని తప్పించి చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ను మేఘా రెడ్డికి ఇచ్చారు. ఆ సమయంలో నిస్సహాయంగా ఉండి పోయారు చిన్నారెడ్డి. అయితే ఇప్పుడు తిరుగుబాటు హెచ్చరికలు జారీ చేస్తుండడం విశేషం. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని.. తన వర్గాన్ని అణచివేస్తున్నారని.. ఇలానే కొనసాగితే తాను కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బాటలోనే అధిష్టానం పై తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
సీనియర్ మోస్ట్ లీడర్…
Also Read:వర్ష భావానికి కాంగ్రెస్ సర్కార్ తో లింకు…! తిప్పికొట్టిన సీఎం రేవంత్
చిన్నారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. అటువంటి చిన్నారెడ్డి సామర్థ్యాన్ని తక్కువగా చూసి గత ఎన్నికల్లో మేఘా రెడ్డికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. అయితే ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత దూసుకుపోతున్నారు. ఆమె రాజకీయాలను తట్టుకోలేక పోతున్నారు చిన్నారెడ్డి. అయితే కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు చిన్నారెడ్డికి రాజకీయంగా ఆ అవకాశం లేదు. ఎందుకంటే వనపర్తి నియోజకవర్గంలో కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఒకవేళ చిన్నారెడ్డి గులాబీ పార్టీలో చేరినా పెద్ద ప్రయోజనం ఉండదు.
