ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లో చురుగ్గా భాగస్వాములు కావడం మంచి పరిణామమని అన్నారు. దేశ భవిష్యత్తులో యువత పాత్ర కీలకమని, యువత రాజకీయ ప్రాతినిధ్యం పెరిగితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. శ్రష్టి వర్మతో పాటు మరికొందరు కూడా ఈ కార్యక్రమంలో బీజేపీలో చేరారు.
‘ఢీ’ షోలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రష్టి వర్మకు డ్యాన్స్ రంగంలో మంచి గుర్తింపు ఉంది. ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ’, ‘ఢీ జోడీ’ వంటి డ్యాన్స్ కార్యక్రమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అనంతరం ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించారు.
కొరియోగ్రాఫర్‌గా తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఆమె పనిచేశారు. పలు ప్రముఖ సినిమాల్లోని పాటలకు నృత్య దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
‘పుష్ప 2’లోని ‘సూసేకి’, రజినీకాంత్ నటించిన ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా’ పాటలతో పాటు ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’, ‘బీస్ట్’, ‘గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాల్లోనూ ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
డ్యాన్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రష్టి వర్మ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో.. ఆమె భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఆసక్తి నెలకొంది.
also read: రాహుల్ గాంధీ ఆస్తుల కేసు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
